Special Trains: దీపావళి ప్రత్యేక రైళ్లు.. తెలుగురాష్ట్రాల మీదుగా వెళ్లేవి ఇవే!

Special trains for diwali by SCR

  • పండుగ రద్దీకి అనుగూణంగా అదనపు సర్వీసులు ప్రారంభించిన రైల్వే శాఖ
  • తెలుగు రాష్ట్రాల మీదుగా పలు సర్వీసులు
  • రైళ్ల ప్రయాణ తేదీలు, ఇతర కీలక వివరాలతో షెడ్యూల్ విడుదల

దీపావళి పండుగను పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లే తెలుగు ప్రజలకు ఓ గుడ్ న్యూస్. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ పలు అదనపు రైలు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఎంపిక చేసిన రూట్లలో అదనపు సర్వీసులను ప్రవేశపెట్టిన రైల్వే శాఖ వీటికి సంబంధించిన ప్రయాణ తేదీలు, ఇతర వివరాలతో కూడిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ స్పెషల్ రైళ్లలో అనేకం తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తాయి. సికింద్రాబాద్, కాచిగూడ లాంటి ప్రధాన స్టేషన్లలో ఇవి ఆగుతాయి. 

రైల్వే శాఖ ప్రకటన ప్రకారం, సికింద్రాబాద్ నుంచి బీహార్‌లోని చంపారన్‌ జిల్లా రక్సౌల్ వరకూ నాలుగు అదనపు జన్ సాధారణ్ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఇవి సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, మహారాష్ట్రలోని నాందేడ్ మీదుగా ప్రయాణించనున్నాయి. నవంబర్ 9 నుంచి 30 మధ్య కొన్ని ఎంపిక చేసిన తేదీల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

More Telugu News