Chandramohan: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

Tollywood Actor Chandramohan died

  • తెలుగు సినీ పరిశ్రమలో విషాదం
  • ఉదయం ఆసుపత్రిలో తుదిశ్వాస వదిలిన చంద్రమోహన్
  • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. మరో దిగ్గజ నటుడిని పరిశ్రమ కోల్పోయింది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ కొద్దిసేపటి క్రితం ఆసుపత్రిలో కన్నుమూశారు. ఉదయం 9:45 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్.. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలారు. మొత్తం 932 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించి, తెలుగు ప్రేక్షకులను అలరించారాయన. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. చంద్రమోహన్ కు భార్య జలంధర, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

Chandramohan
Tollywood
Film Industry
Movies
  • Loading...

More Telugu News