TSRTC: కార్తీకమాస భక్తులకు టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. చవగ్గా శైవక్షేత్రాలు చుట్టేసేలా బస్సులు!

TSRTC Will Run Separate Buses For Kartheeka Masam

  • తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలకు ప్రత్యేకంగా బస్సులు 
  • ఏపీలోని అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట పంచారామాల దర్శనం
  • తెలంగాణలోని వేములవాడ, రామప్ప, వేయి స్తంభాల గుడి, పాలకుర్తి దక్కన్ పంచశైవ క్షేత్రాలకు బస్సులు

కార్తీకమాసం భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు తెలిపింది. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరింది. 

ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలోని పంచారామ క్షేత్రాలకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసింది. ప్రతి ఆదివారంతోపాటు పౌర్ణమి ముందు రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌ నుంచి బస్సులు బయలుదేరుతాయి. మంగళవారం మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ చేరుకుంటాయి. రాజధాని బస్సుల్లో టికెట్ రూ. 4 వేలుగా, సూపర్ లగ్జరీ బస్సుకు రూ. 3,200గా నిర్ణయించారు. దర్శనం, వసతి కోసం అదనంగా రూ. 550 చెల్లించాల్సి ఉంటుంది.

తెలంగాణలోని వేములవాడ, రామప్ప, వేయి స్తంభాల గుడి, పాలకుర్తి తదితర దక్కన్ పంచశైవ క్షేత్రాలకు బస్సులు నడుపుతోంది. ప్రతి ఆదివారం, కార్తీక పౌర్ణమి ముందురోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి సోమవారం రాత్రి తిరిగి నగరానికి చేరుకుంటాయి. రాజధాని బస్సుకు టికెట్ రూ. 2,400, సూపర్ లగ్జరీకి రూ. 1900, ఎక్స్‌ప్రెస్‌కు రూ. 1500గా నిర్ణయించారు. దర్శనం టికెట్లు అదనం.

TSRTC
Kartheek Masam
Shiva Temples
Telangana
Pancharamalu
Andhra Pradesh
  • Loading...

More Telugu News