KA Paul: సీఈవో వికాస్ రాజ్‌ను కలిసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్

KA Paul meets CEO Vikas Raj

  • తమకు పార్టీ సింబల్ ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించిన కేఏ పాల్
  • తన జీవిత కాలంలో ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని చూడలేదని ఆగ్రహం
  • పార్టీ సింబల్ కేటాయించకపోవడం వెనుక అధికార పార్టీ కుట్ర ఉందని ఆరోపణ

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ శుక్రవారం సీఈవో వికాస్ రాజ్‌ను కలిశారు. తమకు పార్టీ సింబల్ కేటాయించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాశాంతి పార్టీకి ఇప్పటి వరకు సింబల్ ఇవ్వాలని కోరుతూనే, ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని అడిగారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తన జీవిత కాలంలో ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని చూడలేదన్నారు. డెమోక్రసీ బతికే ఉందా? అని ప్రశ్నించారు. తమ పార్టీకి సింబల్ కేటాయించకపోవడం వెనుక అధికార పార్టీ కుట్ర ఉందని ఆరోపించారు.

KA Paul
Telangana Assembly Election
ceo
  • Loading...

More Telugu News