Vijayasai Reddy: పురందేశ్వరి గారు ఏం చదువుకున్నారో గానీ...!: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy once again slams Purandeswari

  • పురందేశ్వరిపై విమర్శల దాడి కొనసాగిస్తున్న విజయసాయి
  • ప్రజల తెలివిపై పురందేశ్వరి చులకనభావం ఉందంటూ ట్వీట్
  • బావ ఎడమకంటిలో ఆనందం చూడడం కోసం అసత్యాలు వల్లిస్తున్నారని విమర్శలు

ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. తాజాగా మరోసారి ఎక్స్ లో స్పందించారు. పురందేశ్వరి గారు ఏం చదువుకున్నారో ఏమో గానీ, ప్రజల తెలివితేటలపై ఆమెకు చాలా చులకన భావం ఉందని విజయసాయి పేర్కొన్నారు. అందుకే రాష్ట్రంలో మద్యం మృతులు 50 లక్షల మంది అంటూ దిగ్భ్రాంతి కలిగించే అబద్ధాన్ని అవలీలగా వదిలారని వెల్లడించారు. కంటి శుక్లం ఆపరేషన్ చేయించుకుని కుడి కంటికి కట్టు కట్టుకున్న బావగారి ఎడమ కంటిలో ఆనందం చూడడం కోసమే ఆమె ఇలాంటి అసత్యాలు వల్లిస్తున్నారని విజయసాయి తెలిపారు.

Vijayasai Reddy
Daggubati Purandeswari
YSRCP
BJP
Chandrababu
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News