Raja Singh: దీపావళి ఆంక్షలు... సీఈవో వికాస్ రాజ్‌ను కలిసిన ఎమ్మెల్యే రాజాసింగ్

Rajasingh meets CEO Vikas Raj

  • దీపావళి విషయంలో ఆంక్షలు తొలగించాలని కోరిన రాజాసింగ్
  • బాణసంచా దుకాణాలను బలవంతంగా రాత్రి 10 గంటలకే మూయిస్తున్నారని ఫిర్యాదు
  • అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరుచుకునేలా అనుమతివ్వాలని విజ్ఞప్తి

బీజేపీ ఎమ్మెల్యే, గోషామహల్ అసెంబ్లీ అభ్యర్థి రాజాసింగ్ శుక్రవారం సీఈవో వికాస్ రాజ్‌ను కలిశారు. దీపావళి విషయంలో ఆంక్షలు తొలగించాలని సీఈవోను కోరారు. అధికారులు... బాణసంచా దుకాణాలను రాత్రి 10 గంటలకే బలవంతంగా మూయిస్తున్నారన్నారు. వాటిని అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరుచుకునేలా అనుమతి ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉండగా, గోషామహల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న రాజాసింగ్ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఇక్కడి నుంచి ఆయన వరుసగా రెండుసార్లు గెలుపొందారు. నేడు ఎల్బీ నగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డి నామినేషన్ ప్రక్రియలో ఆయన పాల్గొన్నారు.

Raja Singh
deepawali
Telangana
Telangana Assembly Election
  • Loading...

More Telugu News