Chiyaan Vikram: విక్రమ్ 'ధ్రువ నక్షత్రం' ట్రైలర్ విడుదల

Chiyaan Vikram starring Dhruva Nakshatram trailer out now
  • విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 'ధ్రువ నక్షత్రం'
  • విక్రమ్ సరసన హీరోయిన్ గా రీతూ వర్మ
  • ఆకట్టుకునే దృశ్యాలతో ట్రైలర్ 
ఉగ్రవాదం నేపథ్యంలో విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం 'ధ్రువ నక్షత్రం'. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ రిలీజైంది. ముంబయి దాడుల దృశ్యాలతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రం ఓ అండర్ కవర్ అసైన్ మెంట్ ఇతివృత్తంలో రూపుదిద్దుకున్నట్టు అర్థమవుతోంది. 

ఈ చిత్రంలో విక్రమ్ సరసన రీతూ వర్మ కథానాయిక. పార్తిబన్, రాధికా శరత్ కుమార్, సిమ్రాన్, జైలర్ ఫేమ్ వినాయకన్, దివ్యదర్శిని, సలీమ్ బేగ్ తదితరులు నటించారు. ఈ బహుభాషా చిత్రానికి హ్యారిస్ జయరాజ్ సంగీతం అందించారు. 'ధ్రువ నక్షత్రం' చిత్రం నవంబరు 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

విక్రమ్ విక్రమ్ గతేడాది కోబ్రా, పొన్నియన్ సెల్వన్ రెండు భాగాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన తంగలాన్, ధ్రువ నక్షత్రం చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల వచ్చిన తంగలాన్ టీజర్ కు సైతం విశేష స్పందన వస్తోంది.
Chiyaan Vikram
Dhruva Nakshatram
Trailer
Kollywood
Tollywood

More Telugu News