CM Jagan: శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానమ్ కుమారుడి వివాహ వేడుకకు విచ్చేసిన సీఎం జగన్
![CM Jagan attends Zakia Khanam son marriage in Rayachoti](https://imgd.ap7am.com/thumbnail/cr-20231109tn654cb3d28f854.jpg)
- అన్నమయ్య జిల్లాలో సీఎం జగన్ పర్యటన
- రాయచోటిలో జకియా ఖానమ్ కుమారుడి వివాహం
- వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ ఇవాళ అన్నమయ్య జిల్లా రాయచోటి విచ్చేశారు. రాష్ట్ర శాసనమండలి చైర్ పర్సన్ జకియా ఖానమ్ కుమారుడి వివాహ వేడుకకు హాజరయ్యారు. రాయచోటిలోని అభి అండ్ సుధా కన్వెన్షన్ హాల్లో ఈ వివాహ వేడుక జరిగింది. సీఎం రాకతో కన్వెన్షన్ హాల్లో భారీ కోలాహలం నెలకొంది. సీఎం జగన్ వరుడు మయానా ముషారఫ్ అలీఖాన్, వధువు ఖయంఖానీ మిస్సా ఖానమ్ లకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు చెబుతూ, ఆశీర్వదించారు. ఈ వివాహ కార్యక్రమానికి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తదితర నేతలు కూడా హాజరయ్యారు. అంతేకాదు, రాయచోటిలో మాజీ ఎంపీపీ గౌస్ మహ్మద్ రఫీ కుటుంబ సభ్యుల వివాహ వేడుకకు కూడా సీఎం జగన్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
![](https://img.ap7am.com/froala-uploads/20231109fr654cb2e6adfd7.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20231109fr654cb3975244f.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20231109fr654cb3a4f2c48.jpg)