Kunamneni Sambasiva Rao: కొత్తగూడెం నుంచి బరిలోకి కూనంనేని.. నేడు నామినేషన్

Kunamneni Sambasiva Rao Contesting From Kothagudem

  • బీఫాం అందించిన నారాయణ, చాడ వెంకటరెడ్డి
  • శాసనసభలో కార్మికులు, కర్షకులు, పేదల గొంతు వినిపించేందుకు కూనంనేనిని గెలిపించాలన్న నేతలు
  • 2009లో ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన కూనంనేని

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ ఖరారైంది. కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా ఆయన కొత్తగూడెం నుంచి బరిలోకి దిగుతున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శులు కె. నారాయణ, సయ్యద్ అజీజ్‌పాషా, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఆయనకు బీఫాం అందించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదలు, కార్మికులు, రైతులు, సామాన్యుల గొంతును శాసనసభలో వినిపించేందుకు కూనంనేనిని భారీ మెజార్టీతో గెలిపించాలని కొత్తగూడెం ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సాంబశివరావు నేడు కొత్తగూడెంలో నామినేషన్ దాఖలు చేస్తారు. కాగా, గత 2009లో ఆయన ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

Kunamneni Sambasiva Rao
CPI
CPI Narayana
Kothagudem
Congress
  • Loading...

More Telugu News