Afghanistan: ఆసీస్ కు అవమానం తప్పేలా లేదు... 69 పరుగులకే 5 వికెట్లు డౌన్

Australia lost 5 wickets for 69 runs

  • వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా × ఆఫ్ఘనిస్థాన్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్
  • 50 ఓవర్లలో 5 వికెట్లకు 291 పరుగులు
  • లక్ష్యఛేదనలో ఆసీస్ ఎదురీత

భారత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు అంచనాలకు మించి రాణిస్తోంది. ఇవాళ ఆస్ట్రేలియాతో తలపడుతున్న ఆఫ్ఘనిస్థాన్ అన్ని రంగాల్లో సత్తా చాటుతోంది. 292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన ఆసీస్ ను ఆఫ్ఘన్ బౌలర్లు వణికించారు. నవీనుల్ హక్ 2, ఒమర్జాయ్ 2 వికెట్లతో ఆసీస్ టాపార్డర్ ను కకావికలం చేశారు. వీరిద్దరి బౌలింగ్ తో ఆసీస్ 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ను లబుషేన్, మ్యాక్స్ వెల్ జోడీ ఆదుకునేందుకు ప్రయత్నించింది. అయితే, లబుషేన్ (14) రనౌట్ కావడంతో కంగారూలు ఐదో వికెట్ కోల్పోయారు. ప్రస్తుతం ఆసీస్ 15 ఓవర్లలో 5 వికెట్లకు 73 పరుగులు చేసింది. మ్యాక్స్ వెల్ (12 బ్యాటింగ్), స్టొయినిస్ (1 బ్యాటింగ్) ఆడుతున్నారు.

More Telugu News