Yatra 2: ‘యాత్ర 2’లో సోనియాగాంధీ పాత్ర ఫస్ట్ లుక్ విడుదల.. సోనియా పాత్రలో ఎవరు నటించారంటే..!

Suzanne Bernert in Sonia Gandhi character in Yatra 2 movie

  • గత ఎన్నికలకు ముందు 'యాత్ర' సినిమా విడుదల
  • ఈ ఎన్నికలకు ముందు ప్రేక్షకుల ముందుకు రానున్న 'యాత్ర 2'
  • సోనియా పాత్రను పోషించిన జర్మనీ నటి సుజానే బెర్నెర్ట్

గత ఎన్నికలకు ముందు దివంగత రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా 'యాత్ర' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఎన్నికల ముందు 'యాత్ర 2' వస్తోంది. ఈ చిత్రంలో వైఎస్ పాత్రను మమ్ముట్టి పోషిస్తుండగా... జగన్ పాత్రను తమిళ నటుడు జీవా పోషిస్తున్నారు. వైఎస్ మరణానికి ముందు, మరణం తర్వాత ఉన్న పరిస్థితులు, జగన్ సీఎం అయిన విధానాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. 2024 ఫిబ్రవరి 8న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

ఈ సినిమాలో చంద్రబాబు పాత్రను బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్ పోషిస్తున్నట్టు సమాచారం. మరోవైపు సోనియాగాంధీ పాత్రలో జర్మనీ నటి సుజానే బెర్నెర్ట్ నటిస్తున్నారు. తాజాగా సోనియాగాంధీ పాత్ర ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. సుజానే బాలీవుడ్ లో సీరియల్స్, వెబ్ సిరీస్ లలో నటించారు. గతంలో మన్మోహన్ సింగ్ కు సంబంధించి తెరకెక్కిన 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' చిత్రంలో కూడా ఆమె సోనియా పాత్రను పోషించారు. ఈ చిత్రానికి మహి వీ రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్రీ ఆటమ్ లీవ్స్, శివ మేక, వీ సెల్యులాయిడ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More Telugu News