Chandrababu: పూర్తయిన చంద్రబాబు కంటి ఆపరేషన్.. ఇంటికి బయల్దేరిన టీడీపీ అధినేత

Chandrababu eye operation completed

  • ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చంద్రబాబుకు క్యాటరాక్ట్ ఆపరేషన్
  • దాదాపు 2 గంటల సేపు ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు
  • నివాసంలో విశ్రాంతి తీసుకోనున్న చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబుకు హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో శస్త్ర చికిత్స పూర్తయింది. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు ఆయనకు విజయవంతంగా క్యాటరాక్ట్ ఆపరేషన్ ను నిర్వహించారు. ఈ ఆపరేషన్ దాదాపు 2 గంటల సేపు కొనసాగింది. శస్త్ర చికిత్స ముగిసిన వెంటనే ఆయన జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి బయల్దేరారు. ఇంటికి చేరుకున్న తర్వాత ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. మరోవైపు చంద్రబాబును చూసేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ ఆభిమానులు ఆసుపత్రికి వచ్చారు. చంద్రబాబు కంటి ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Chandrababu
Telugudesam
Eye Operation
  • Loading...

More Telugu News