Vishnu Vardhan Reddy: ఏపీలో ఆ రెండు పార్టీలకు అవకాశం ఇచ్చారు... ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలుసు: విష్ణువర్ధన్ రెడ్డి

Vishnu Vardhan Reddy appeals for one chance to BJP in AP
  • శ్రీ సత్యసాయి జిల్లా బీజేపీ బూత్ లెవల్ నేతలతో పార్టీ అగ్రనేతల సమావేశం
  • హాజరైన పురందేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డి
  • టీడీపీ, వైసీపీలపై విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు
  • ఏపీలో బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి
శ్రీ సత్యసాయి జిల్లా బీజేపీ బూత్ లెవల్ అధ్యక్షులతో పార్టీ అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. 

ఈ సమావేశం అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో స్పందించారు. ఏపీలో ఐదేళ్లు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారని, వైసీపీకి నాలుగున్నరేళ్లుగా అవకాశం ఇచ్చారని, ఈ రెండు పార్టీల వల్ల రాష్ట్ర పరిస్థితి నేడు ఎలా తయారైందో ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. ఈ రెండు పార్టీల నేతలు తమ వర్గ, వ్యక్తిగత కక్షపూరిత రాజకీయాలతో గత పదేళ్లుగా కేసులు, జైళ్లు, బెయిళ్లతో పాలన చేశారని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. ఈ పరిస్థితుల్లో బీజేపీకి కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటే డబుల్ ఇంజిన్ సర్కారుతో రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
Vishnu Vardhan Reddy
BJP
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News