Devineni Uma: కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్ నోరు విప్పాలి: దేవినేని ఉమా

Devineni UMA demands Jagan to respond on KCR comments
  • నాలుగున్నరేళ్లలో రోడ్ల గురించి జగన్ పట్టించుకోలేదని విమర్శ
  • రాష్ట్ర పరువును రోడ్డున పడేశారని మండిపాటు
  • ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ గత నాలుగున్నర ఏళ్లుగా రాష్ట్రంలోని రోడ్ల గురించి పట్టించుకోలేదని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా విమర్శించారు. జగన్ పాలనపై తెలంగాణ సీఎం, మంత్రులు కూడా హేళన చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రం పరువును జగన్ రోడ్డున పడేశారని అన్నారు. ప్రజల అవస్థలను జగన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై జగన్ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యల వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. 

కేసీఆర్ మళ్లీ రాకపోతే మనది కూడా అమరావతి అవుతుందని హరీశ్ చేసిన వ్యాఖ్యలు వీడియోలో ఉన్నాయి. ఏపీ రోడ్ల దుస్థితిపై కేసీఆర్ చేసిన కామెంట్ వీడియోలో ఉంది. 
Devineni Uma
Telugudesam
Jagan
YSRCP
KCR
Harish Rao
BRS

More Telugu News