Raviteja: రవితేజ ఈగల్ టీజర్.. ‘ఊరూ ఉండదు.. నీ ఉనికీ ఉండదంటున్న మాస్ మహారాజా’

Ravitejas Eagle Teaser Released Movie Will Release On January 13th 2024

  • గూస్ బంప్స్ తెప్పిస్తున్న రవితేజ కొత్త సినిమా టీజర్
  • లుంగీ పైకి కట్టి, చేతిలో తుపాకీతో ఊర మాస్ గా రవితేజ
  • షూటింగ్ పూర్తి.. శరవేగంగా జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు
  • హీరోయిన్లుగా అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్

మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ‘ఈగల్’ టీజర్ తాజాగా విడుదలైంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచిన సినిమా బృందం ఇప్పుడు టీజర్ తో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. టీజర్ చూస్తుంటే రవితేజ ఖాతాలో మరో హిట్ ఖాయమని అనిపిస్తోంది. బాంబు పేలిన తర్వాతి దృశ్యాలతో, రవితేజ వాయిస్ ఓవర్ తో టీజర్ మొదలవుతుంది.

‘కొండలో ఉన్న లావాను కిందకు పిలవకు.. ఊరు ఉండదు, నీ ఉనికీ ఉండదు’ అంటూ రవితేజ పవర్ ఫుల్ డైలాగ్ వినిపిస్తుంది. రవితేజ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న అనుపమ పరమేశ్వరన్.. అతడు ఎక్కడుంటాడని అడగగా, అడవిలో ఉంటాడని అవసరాల శ్రీనివాస్ జవాబిస్తాడు. అడవిలో ఉంటాడు.. నీడై తిరుగుతుంటాడు.. కనిపించడు కానీ వ్యాపించి ఉంటాడని చెప్పడం సస్పెన్స్ ను రేకెత్తిస్తోంది.

నవదీప్ చెప్పిన డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇది విధ్వంసమే.. తర్వాత చూడబోయేది విశ్వరూపమే అంటూ నవదీప్ చెబుతున్నాడు. వెలుతురు వెళ్లే ప్రతిచోటికీ ఆయన బుల్లెట్ వెళుతుందనే డైలాగ్ అభిమానులకు పూనకం తెప్పించేలా ఉంది. బీజీఎం అదిరిపోయింది. ఇక ఈ టీజర్ లో రవితేజ లుంగీ కట్టి, చేతిలో తుపాకీతో మరింత మాస్‏గా కనిపించారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా, మధుబాల, నవదీప్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తయిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

More Telugu News