Dharmapuri Arvind: రేవంత్‌తో పోలిస్తే కేసీఆరే కాస్త బెటర్.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దేనికి సంకేతం?

BJP MP Dharmapuri Arvind Said KCR Better Than Revanth

  • మెట్ పల్లిలో అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై చర్చ
  • రేవంత్‌కు మేడిగడ్డ వెళ్తే పిల్లర్లు మునిగిపోతాయని ఎద్దేవా
  • రేవంత్-కేసీఆర్ బంధాన్ని బయటపెడతానని హెచ్చరిక

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, ఆయన కుటుంబంపై నిత్యం విమర్శలు గుప్పించే ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆయన వ్యాఖ్యలు దేనికి సంకేతమని సొంతపార్టీ నేతల్లోనూ చర్చ మొదలైంది.

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఆయన మాట్లాడుతూ.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో పోలిస్తే కేసీఆర్ కాస్తంత మంచోడేనని వ్యాఖ్యానించారు. రేవంత్ కేసీఆర్‌కు మించిన మోసగాడని విమర్శించారు. ఆయన మేడిగడ్డ వెళ్తే అక్కడి పిల్లర్లు మునిగిపోతాయని ఎద్దేవా చేశారు. 

రేవంత్‌కు, కేసీఆర్‌కు మధ్య ఉన్న అనుబంధాన్ని త్వరలోనే బయటపెడతానని హెచ్చరించారు. రేపు (మంగళవారం) బీసీ సమ్మేళనం, 11న ఎస్సీ సదస్సు కోసం ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ వస్తున్నట్టు తెలిపారు. ఈ నెలలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావన్న ఆయన బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందంటూనే హంగ్ తప్పదని జోస్యం చెప్యారు. అదే జరిగితే బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Dharmapuri Arvind
BJP
Revanth Reddy
KCR
  • Loading...

More Telugu News