Amala Paul: ప్రియుడితో కొత్త జీవితం... రెండో పెళ్లి చేసుకున్న అమలా పాల్

Amala Paul and Jagat Desai get married

  • కొచ్చిలో అమలా పాల్, జగత్ దేశాయ్ వివాహం
  • ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న జగత్ దేశాయ్
  • గతంలో దర్శకుడు ఏఎల్ విజయతో అమలా పాల్ పెళ్లి... ఆపై విడాకులు

అందాల నటి అమలా పాల్ రెండో పెళ్లి చేసుకుంది. టూరిజం-హాస్పిటాలిటీ రంగ నిపుణుడు జగత్ దేశాయ్ తో కొన్నాళ్లుగా అమలా పాల్ ప్రేమలో ఉంది. నేడు కేరళలోని కొచ్చిలో ఓ హోటల్ లో అమలా పాల్, జగత్ దేశాయ్ పెళ్లితో ఒక్కటయ్యారు. 

అమలా పాల్ కు గతంలో ఓసారి వివాహమైంది. దర్శకుడు ఏఎల్ విజయ్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లయిన కొన్నాళ్లకే విభేదాలు తలెత్తడంతో వీరు విడిపోయారు. 

ఆ తర్వాత అమలా పాల్... జగత్ దేశాయ్ కి దగ్గరైంది. జగత్ దేశాయ్ తన ప్రేయసి అమలా పాల్ కు లవ్ ప్రపోజ్ చేసిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా, వీరిద్దరూ పెళ్లితో తమ జీవితంలో కొత్త దశలోకి ప్రవేశించారు. వివాహానికి సంబంధించిన ఫొటోలను జగత్ దేశాయ్ సోషల్ మీడియాలో  పంచుకున్నాడు.

Amala Paul
Jagat Desai
Wedding
Actress
  • Loading...

More Telugu News