Peddireddi Ramachandra Reddy: పురందేశ్వరి టీడీపీ గౌరవాధ్యక్షురాలిగా పనిచేస్తున్నట్టుంది: మంత్రి పెద్దిరెడ్డి

Peddireddy slams Purandeswari

  • విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి పర్యటన
  • ఇండోర్ సబ్ స్టేషన్ కు ప్రారంభోత్సవం
  • పురందేశ్వరి టీడీపీ కోసం పనిచేసినా తమకేమీ ఇబ్బందిలేదన్న పెద్దిరెడ్డి
  • కానీ ఆమె వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ మంత్రుల విమర్శల దాడి కొనసాగుతోంది. చంద్రబాబు తరఫున పురందేశ్వరి వకాల్తా పుచ్చుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని, ఆమె టీడీపీ కోసం పనిచేసినా తమకు ఇబ్బందేమీ లేదని, కానీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. 

పురందేశ్వరి మద్యం విషయంలో చంద్రబాబుతో మాట్లాడితే బాగుంటుందని అన్నారు. రాష్ట్రంలోని మద్యం డిస్టిలరీలన్నీ చంద్రబాబు మంజూరు చేసినవేనని పెద్దిరెడ్డి వెల్లడించారు. ఈ విషయాన్ని పురందేశ్వరి గ్రహించాలని సూచించారు. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే పురందేశ్వరి టీడీపీ గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నట్టుందని వ్యంగ్యం ప్రదర్శించారు. 

మంత్రి పెద్దిరెడ్డి ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.

Peddireddi Ramachandra Reddy
Daggubati Purandeswari
Chandrababu
YSRCP
TDP
BJP
Andhra Pradesh
  • Loading...

More Telugu News