Virender Sehwag: కోహ్లీకి బర్త్ డే విషెస్ చెప్పిన వీరేంద్ర సెహ్వాగ్

Sehwag Birthday Wishes To Virat Kohli

  • ఆటలో ఎత్తుపల్లాలు సహజమన్న మాజీ క్రికెటర్
  • కోహ్లీలో పరుగుల దాహం మాత్రం ఎప్పటికీ అలాగే ఉందని కామెంట్
  • హిమోగ్లోబిన్ తరహాలో కోహ్లీ నరనరాల్లో సెంచరీ పరుగులు పెడ్తుందంటూ కితాబు

కళ్లలో కోటి కలలతో మైదానంలోకి అడుగుపెట్టే ఆ యువకుడు బ్యాట్ తో పరుగుల వరద పారిస్తాడని.. రక్తంలో హిమోగ్లోబిన్ తరహాలో ఆయన నరనరాల్లో సెంచరీ పరుగులు పెడుతుందని విరాట్ కోహ్లీ గురించి మాజీ క్రికెటర్, ఎంపీ వీరేంద్ర సెహ్వాగ్ పొగడ్తల వర్షం కురిపించాడు. నేడు కోహ్లీ పుట్టిన రోజు కావడంతో ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పాడు. కోహ్లీ దూకుడు గురించి పక్కనే ఉండి చూసిన వ్యక్తిగా మైదానంలో ఎలా ఉంటాడో ఈ సందర్భంగా వివరించాడు.

ఆటలో ఎత్తుపల్లాలు సహజమేనని చెబుతూ కోహ్లీలో మాత్రం ఆ ఇంటెన్సిటీ ఏమాత్రం తగ్గలేదని కితాబిచ్చాడు. కోహ్లీ పరుగుల దాహం ఎప్పటికీ తీరేదికాదని తెలిపాడు. ఆటపై అతడికున్న ఫ్యాషన్, మైదానంలో చేసే హార్డ్ వర్క్ కు తోడు అతడి టాలెంట్ గేమ్ ను శాసిస్తాయని ప్రశంసించాడు.

Virender Sehwag
Virat Kohli
Birthday wishes
sports
  • Loading...

More Telugu News