KCR: 28వ తేదీ వరకు 54 సభలు... సీఎం కేసీఆర్ రెండో విడత ప్రచార షెడ్యూల్ ఇదే

CM KCR election campaign schedule from november 13

  • 16 రోజుల్లో 54 సభలలో పాల్గొననున్న కేసీఆర్
  • 17న కరీంనగర్, 22న కొడంగల్‌లో ప్రజా ఆశీర్వాద సభలు
  • 25న హైదరాబాద్, 26న దుబ్బాక, 28న గజ్వేల్‌లో సభలు

ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో విడత ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 13వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 54 సభల్లో పాల్గొంటారు. ఈ నెల 17న కరీంనగర్, 22న కొడంగల్, 25న హైదరాబాద్, 26న దుబ్బాక, 28న గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభలలో పాల్గొననున్నారు. కేసీఆర్ ఇప్పటి వరకు 30 నియోజకవర్గాల్లో సభలకు హాజరయ్యారు. ఈ నెల 9వ తేదీ వరకు మరో 12 సభలకు హాజరు కానున్నారు. సీఎం కేసీఆర్ 9వ తేదీన గజ్వేల్‌లో, కామారెడ్డిలలో నామినేషన్ దాఖలు చేస్తారు.

13వ తేదీన దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట,
14వ తేదీన పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నం,
15వ తేదీన బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్,
16వ తేదీన అదిలాబాద్, బోథ్, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్,
17వ తేదీన కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, పరకాల,
18వ తేదీన చేర్యాల,
19వ తేదీన అలంపూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూలు, కల్వకుర్తి,
20వ తేదీన మానకొండూరు, స్టేషన్ ఘనపూర్, నకిరేకల్, నల్గొండ,
21వ తేదీన మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట,
22వ తేదీన తాండూరు, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగి,
23వ తేదీన మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్ చెరు,
24వ తేదీన మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి, 
25వ తేదీన హైదరాబాద్,
26వ తేదీన ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక,
27వ తేదీన షాద్ నగర్, చేవెళ్ల, ఆందోల్, సంగారెడ్డి,
28వ తేదీన వరంగల్, గజ్వేల్

  • Loading...

More Telugu News