Bandi Sanjay: ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం... బండి సంజయ్ మరోసారి పాదయాత్ర?

Bandi Sanjay padayatra again in Karimnagar district

  • పాదయాత్రకు అధిష్ఠానం నుంచి సూచనలు అందడంతో బండి సంజయ్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా కథనాలు
  • కరీంనగర్, సిరిసిల్ల, నారాయణపేట నియోజకవర్గాలలో పాదయాత్ర
  • ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి ప్లాన్

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ లోక్ సభ సభ్యుడు బండి సంజయ్‌తో మరోసారి పాదయాత్ర చేయించాలని నిర్ణయించింది. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసి పార్టీని బలోపేతం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు మరోసారి ఆయనతో పరిమిత పాదయాత్ర చేయించాలని నిర్ణయించినట్లుగా వార్తలు వచ్చాయి. అధిష్ఠానం నుంచి సూచనలు రావడంతో బండి సంజయ్ పాదయాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెబుతున్నారు.

ఈ పాదయాత్ర ఈ నెల 7వ తేదీన కరీంనగర్ పట్టణం నుంచి ప్రారంభం కానుంది. ఎన్నికలకు మరెంతో సమయం లేనందున కరీంనగర్, సిరిసిల్ల, నారాయణపేట నియోజకవర్గాలలో పాదయాత్ర ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఏడో తేదీన కరీంనగర్‌లో ప్రారంభమయ్యే పాదయాత్ర 8వ తేదీన సిరిసిల్ల, నారాయణపేట నియోజకవర్గాల్లో ఉండనుంది. బుల్లెట్ ప్రూఫ్ కారుతో ఆయన ప్రచారం చేయనున్నారు. మరోవైపు, తనకు అధిష్ఠానం కేటాయించిన హెలికాప్టర్‌తో ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయనున్నారని చెబుతున్నారు.

Bandi Sanjay
BJP
Telangana Assembly Election
padayatra
  • Loading...

More Telugu News