Vijay: ఆసుపత్రికి వెళ్లిన తమిళ స్టార్ హీరో విజయ్.. కారణం ఇదే!

Vijay went to hospital

  • ఈ ఉదయం చెన్నైలోని ఓ ఆసుపత్రికి వెళ్లిన విజయ్
  • విజయ్ మక్కల్ ఇయక్కం రాష్ట్ర కార్యదర్శి బుస్సీ ఆనంద్ కు పరామర్శ
  • తదుపరి సినిమా షూటింగ్ కోసం బ్యాంకాక్ కు పయనం

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 'లియో' సినిమాతో మరో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రం దాదాపు రూ. 500 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిన్న గ్రాండ్ గా నిర్వహించారు. మరోవైపు విజయ్ ఓ ఆసుపత్రిలో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఓ హాస్పిటల్ నుంచి విజయ్ బయటకు వస్తున్న వీడియో దృశ్యాలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. 

అయితే విజయ్ ఆసుపత్రికి ఎందుకు వెళ్లారనే విషయంపై ఆయన సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. విజయ్ మక్కల్ ఇయక్కం సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ ను పరిమర్శించడానికి ఆయన ఆయన ఆసుపత్రికి వెళ్లారట. విపరీతమైన అలసట కారణంగా ఆనంద్ చెన్నైలోని ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయనను పరామర్శించేందుకు ఈ ఉదయం విజయ్ ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం తన తదుపరి సినిమా షూటింగ్ కోసం విజయ్ బ్యాంకాక్ కు పయనమయ్యారు. ప్రస్తుతం ఆయన వెంకట్ ప్రభు దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.

Vijay
Tollywood
Kollywood
  • Loading...

More Telugu News