Cricket: సెమీస్‌కు చేరువైన ఆప్ఘనిస్థాన్.. పాకిస్థాన్ పరిస్థితి ఏంటంటే..!

How Afghanistan s Win Impacts Pakistans Semifinals Dream

  • నెదర్లాండ్స్‌పై గెలుపుతో 5వ స్థానానికి ఆప్ఘన్
  • పాయింట్లు సమానమే అయినా మెరుగైన రన్‌రేట్ కారణంగా 4వ స్థానంలో కివీస్
  • ఆఫ్ఘనిస్థాన్ గెలుపుతో మరింత సంక్లిష్టంగా మారిన పాక్ సెమీస్ అవకాశాలు

భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ 2023లో టీమిండియా ఇప్పటికే సెమీ ఫైనల్‌కు చేరుకోగా.. మిగతా మూడు జట్లు ఏవి అనేది రసవత్తరంగా మారింది. శుక్రవారం లక్నో వేదికగా నెదర్లాండ్స్‌పై 7 వికెట్ల తేడాతో సునాయాసంగా విజయం సాధించిన ఆప్ఘనిస్థాన్ సెమీఫైనల్‌ అవకాశాలను మరింత మెరుగుపరచుకుంది. ఇప్పటివరకు7 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు 4 గెలుపులతో( 8 పాయింట్లు) పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి దూసుకెళ్లింది. ఫలితంగా నాలుగవ స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో సమానమైన పాయింట్లను కలిగి ఉంది. అయితే మెరుగైన రన్‌రేట్ కారణంగా కివీస్ నాలుగో స్థానంలో ఉంది. ఇక ఆస్ట్రేలియా 8 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. అయితే ఆసీస్ 6 మ్యాచ్‌లు మాత్రమే ఆడడం గమనార్హం.

ఆప్ఘనిస్థాన్ గ్రూప్ దశలో మిగిలి ఉన్న తమ చివరి 2 మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలను ఢీకొట్టనుంది. ఈ 2 మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే ఆ జట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉంటాయి. ఇక న్యూజిలాండ్ తన చివరి 2 మ్యాచ్‌లను సొంతం చేసుకుంటే నాలుగవ స్థానం నెట్ రన్ రేట్ ఆధారంగా నిర్ణయించాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా ఆడబోయే మ్యాచ్ ఫలితాలు ప్రతికూలంగా ఉంటే న్యూజిలాండ్, ఆప్ఘనిస్థాన్ రెండూ అర్హత సాధించే అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియా ఇంకా 3 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా ఒకటి ఆఫ్ఘనిస్థాన్‌పై ఉంది.

అయితే నెదర్లాండ్స్‌పై ఆప్ఘనిస్థాన్ గెలుపు పాకిస్థాన్‌కు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. బాబర్ అజామ్ నేతృత్వంలోని పాక్ 7 మ్యాచ్‌లు ఆడి 3 విజయాలు సాధించడంతో 6 పాయింట్లను మాత్రమే కలిగివుంది. మిగిలిన 2 మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే ఆ జట్టు వద్ద గరిష్ఠంగా 10 పాయింట్లు ఉంటాయి. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆప్ఘనిస్థాన్ తమ మిగిలిన మ్యాచ్‌లలో ఎలా రాణిస్తాయనే దాన్నిబట్టి పాకిస్థాన్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. నెట్ రన్‌రేట్ అత్యంత కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. కాగా 14 పాయింట్లతో భారత్ ఇప్పటికే అర్హత సాధించిగా దక్షిణాఫ్రికా 12 పాయింట్లతో దాదాపు అర్హత సాధించింది.

More Telugu News