Prakash Javadekar: నెల రోజుల తర్వాత బీజేపీ గెలవడాన్ని మీరు చూస్తారు: ప్రకాశ్ జవదేకర్ ధీమా

Prakash javadekar says bjp will in telangana elections

  • బీజేపీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని ప్రకాశ్ జవదేకర్ ధీమా
  • బీఆర్ఎస్ రెండో స్థానం, కాంగ్రెస్ మూడోస్థానంలో ఉంటుందని వ్యాఖ్య
  • ఇక నుంచి మీడియా ప్రతినిధులకు కత్రియా హోటల్ నుంచే వివరాలు అందిస్తామన్న జవదేకర్

నెల రోజుల తర్వాత బీజేపీ గెలవడాన్ని మీరు చూస్తారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్ ప్రకాశ్ జవదేకర్ అన్నారు. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, బీఆర్ఎస్ రెండో స్థానం, కాంగ్రెస్ మూడో స్థానంతో సరిపెట్టుకుంటాయని వ్యాఖ్యానించారు. ఇక మీడియా ప్రతినిధులు పార్టీ కార్యాలయానికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. బీజేపీ అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. శుక్రవారం కత్రియా హోటల్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఇక నుంచి పార్టీకి సంబంధించి పూర్తి వివరాలు కత్రియా హోటల్ నుంచే అందిస్తామని, పార్టీ కార్యాలయానికి ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు.

Prakash Javadekar
BJP
Telangana Assembly Election
  • Loading...

More Telugu News