Venkaiah Naidu: అలాంటి వాళ్లకే ఓటేయండి: వెంకయ్యనాయుడు 

Venkaiah Naidu opines on vote

  • తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన వెంకయ్యనాయుడు
  • రేణిగుంట ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడిన భారత  మాజీ ఉపరాష్ట్రపతి
  • ఓటు హక్కు ప్రాధాన్యత వివరించిన వైనం
  • ప్రలోభాలకు గురైతే ఐదేళ్లు బాధపడాల్సి ఉంటుందని వెల్లడి

భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరులమ శ్రీవారి దర్శనం కోసం వెళుతూ రేణిగుంట ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో, ఓటు హక్కు గురించి ఆయన తన అభిప్రాయాలను పంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 

అయితే, ఎలాంటి వాళ్లను ఎన్నుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు, నీతినిజాయతీతో వ్యవహరించే వ్యక్తులకు ఓటు వేయాలని సూచించారు. అవినీతికి పాల్పడని, అక్రమాలు చేయని నేతలను మాత్రమే ఎన్నుకోవాలని, అలా కాకుండా ప్రలోభాలకు గురై ఓటు వేస్తే మాత్రం ఐదేళ్లు బాధ పడాల్సి ఉంటుందని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. 

ప్రలోభాలు తాత్కాలికమైనవని అన్నారు. ఎన్నికల్లో కులం, ధనం కాకుండా అభ్యర్థి గుణం చూడాలని ఓటర్లకు దిశానిర్దేశం చేశారు.

Venkaiah Naidu
Vote
Elections
Renigunta
Tirumala
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News