Chandrababu: ఏఐజీ ఆసుపత్రి నుంచి చంద్రబాబు డిశ్చార్జి... వీడియో ఇదిగో!

Chandrababu discharge from AIG Hospital in Hyderabad

  • ఆసుపత్రిలో చేరాలని చంద్రబాబుకు వైద్యుల సూచన
  • నిన్న హైదరాబాదు ఏఐజీ ఆసుపత్రిలో చేరిన టీడీపీ అధినేత
  • నేడు చంద్రబాబుకు మరికొన్ని వైద్య పరీక్షలు 

టీడీపీ అధినేత చంద్రబాబు వైద్యుల సలహా మేరకు నిన్న హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చేరడం తెలిసిందే. రాజమండ్రి జైలు నుంచి విడుదలై, ఉండవల్లి నుంచి హైదరాబాద్ వచ్చిన చంద్రబాబుకు ఏఐజీ వైద్యులు తొలుత ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. వాటికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ వచ్చిన అనంతరం ఆయనను ఆసుపత్రిలో చేరాలని సూచించారు. దాంతో ఆయన గురువారం సాయంత్రం ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఇవాళ ఆయనకు మరికొన్ని పరీక్షలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, నేటి సాయంత్రం చంద్రబాబు ఏఐజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 

చంద్రబాబు కోసం టీడీపీ మద్దతుదారులు భారీ సంఖ్యలో ఆసుపత్రి వద్దకు వచ్చారు. ఆసుపత్రి నుంచి బయటికి వచ్చిన చంద్రబాబు వారందరికీ అభివాదం చేస్తూ కారెక్కి తన నివాసానికి వెళ్లిపోయారు.

Chandrababu
AIG Hospital
Discharge
TDP
Hyderabad
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News