Amit Shah: అమిత్ షాతో భేటీ కానున్న జూనియర్ ఎన్టీఆర్?

Junior NTR to meet Amit Shah

  • మునుగోడు ఎన్నికల సమయంలో భేటీ అయిన అమిత్ షా, తారక్
  • ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీపై ఆసక్తి
  • చంద్రబాబు అరెస్ట్ పై ఇంతవరకు స్పందించని జూనియర్ ఎన్టీఆర్

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మరోసారి భేటీ కాబోతున్నారనే వార్త వైరల్ అవుతోంది. గత ఏడాది మునుగోడు ఎన్నికల సందర్భంగా వీరిద్దరి భేటీ కొనసాగిన సంగతి తెలిసిందే. శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో ఉన్న నొవాటెల్ హోటల్ లో దాదాపు అరగంట సేపు వీరు భేటీ అయ్యారు. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరూ మరోసారి కలవబోతున్నారనే వార్తలు ఆసక్తిని రేపుతున్నాయి. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారి కూడా స్పందించని విషయం తెలిసిందే.

Amit Shah
BJP
Junior NTR
Tollywood
  • Loading...

More Telugu News