Nagababu: సోదరులతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన నాగబాబు.. తీవ్ర భావోద్వేగం

Naga Babu pens emotional post

  • వరుణ్, లావణ్యల పెళ్లి సందర్భంగా ఒకే చోట చేరిన మెగా బ్రదర్స్
  • సోదరులతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన నాగబాబు
  • తమది విడదీయలేని అనుబంధం అన్న నాగబాబు

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల పెళ్లి సందర్భంగా మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే చోట చేరి సంతోషకర సమయాన్ని గడిపింది. పెళ్లి వేడుక సందర్భంగా దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబుల ఫొటో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. ఈ ఫొటోను ఇన్స్టా వేదికగా షేర్ చేసిన నాగబాబు... భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టారు. తమ మధ్య బేదాభిప్రాయాలు, వాదనలు ఉన్నప్పటికీ... తమ అనుబంధం ఎంతో ప్రత్యేకమైనదని చెప్పారు. ఆ అనుబంధం తాము చేసిన పనులకు, వాటి జ్ఞాపకాలకు చెందినది మాత్రమే కాదని... అది ఎంతో లోతైన బంధమని అన్నారు. తమది విడదీయలేని అనుబంధమని తెలిపారు.

Nagababu
Chiranjeevi
Pawan Kalyan
  • Loading...

More Telugu News