Rohit Sharma: శ్రీలంకపై విజయం తర్వాత అభిమానికి బూట్లు గిఫ్ట్‌గా ఇచ్చిన రోహిత్‌శర్మ.. వీడియో ఇదిగో!

Rohit Sharma gives away his shoes to young fan

  • ఫ్యాన్స్‌తో సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా గడిపిన రోహిత్
  • వీడియోను షేర్ చేసిన ఎక్స్ యూజర్
  • ఆదివారం సౌతాఫ్రికాతో తలపడనున్న టీమిండియా

ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం తర్వాత సారథి రోహిత్‌శర్మ ఫ్యాన్స్‌తో సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా గడిపాడు. అంతేకాదు, ఓ కుర్రాడికి తన షూ ఇచ్చి ఆశ్చర్యానికి గురిచేశాడు.  వైరల్ అవుతున్న వీడియోలో ఓ షూను చిన్నారికి ఇవ్వడం కనిపించింది. ‘‘పోస్ట్ ప్రజెంటేషన్ కార్యక్రమం తర్వాత రోహిత్ శర్మ ఫ్యాన్స్‌తో సెల్ఫీలు తీసుకున్నాడు. ఎంసీఏ స్టాండ్‌లో తన షూను ఓ కుర్రాడికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. హృదయాన్ని కదిలించింది’’ అని ఎక్స్‌లో ఈ వీడియోను షేర్ చేసిన సమీర్ అ్లల్లానా పేర్కొన్నాడు. 

వైరల్ అయిన ఈ వీడియోపై ఓ యూజర్ స్పందిస్తూ.. ఒక్క షూనే ఇచ్చాడా? అని ప్రశ్నించగా.. ‘‘రోహిత్ వెనక్కి వచ్చి రెండో షూ కూడా ఇచ్చేశాడు’’ అని బదులిచ్చాడు. ‘రోహిత్‌శర్మ నిజమైన జెంటిల్మన్.. గొప్ప కెప్టెన్’ అని ఇంకో యూజర్ కామెంట్ చేశాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో రోహిత్ విఫలమైనప్పటికీ జట్టుకు అద్వితీయ విజయాన్ని అందించిపెట్టాడు. భారత జట్టు ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచుల్లోనూ విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించింది. భారత్ తన తర్వాతి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఎదుర్కోనుంది. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరగనుంది.

Rohit Sharma
Team India
Shoes
Sri Lanka
World Cup 2023

More Telugu News