Sushmita Sen: రిపోర్టుల్లో అంతా బానే ఉన్నా గుండెపోటు వచ్చింది: సుస్మితా సేన్

Sushmita sen talks about her days prior to heart attack

  • ఈ ఏడాది మార్చిలో సుస్మితా సేన్‌కు యాంజియోప్లాస్టీతో స్టంట్ వేసిన వైద్యులు
  • ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న నటి
  • నాటి పరిస్థితులను మీడియాకు వివరించిన వైనం

బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌కు ఈ ఏడాది మార్చిలో యాంజియోప్లాస్టీ చేసి స్టంట్ వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకున్నారు. కాగా, అప్పటి పరిస్థితుల గురించి ఆమె మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు. 

తన తల్లిదండ్రులకు హృదయ సంబంధిత సమస్యలు ఉన్నందున తనకూ ఈ సమస్య వచ్చే అవకాశం ఉందన్న విషయం తెలుసని సుస్మిత తెలిపారు. ఏటా రెండు మార్లు గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకునేదాన్నని వెల్లడించారు. ఇటీవల జరిగిన పరీక్షల్లో అంతా సవ్యంగా ఉన్నట్టు రిపోర్టు వచ్చినా చివరకు తాను గుండెపోటు బారిన పడ్డానని వాపోయారు.

Sushmita Sen
Bollywood
Tollywood
  • Loading...

More Telugu News