Kasani Gnaneswar: నేడు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరుతున్న కాసాని జ్ఞానేశ్వర్

Kasani Gnaneswar to join BRS in presence of KCR
  • టీడీపీకి రాజీనామా చేసిన కాసాని
  • ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకత
  • ముదిరాజ్ సామాజికవర్గంలో కాసానికి మంచి గుర్తింపు
తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీకి కాసాని రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీడీపీని కాదని మరో పార్టీని గెలిపించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. మరోవైపు, ముదిరాజ్ సామాజికవర్గంలో కాసానికి మంచి గుర్తింపు ఉంది.
Kasani Gnaneswar
KCR
BRS
Telugudesam

More Telugu News