Pawan Kalyan: వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలో బాబాయ్-అబ్బాయ్ జోష్... ఫొటోలు ఇవిగో!

Pawan Kalyan and Ram Charan in joyous mood at Varun Tej wedding with Lavanya Tripathi

  • ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి
  • సందడి చేసిన మెగా ఫ్యామిలీ మెంబర్స్
  • పెళ్లి వేడుకలో ఉత్సాహంగా పవన్ కల్యాణ్, రామ్ చరణ్

టాలీవుడ్ ప్రేమజంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఓ ఇంటివారైన సంగతి తెలిసిందే. వారి పెళ్లి ఇటలీలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ మెంబర్స్, వారి సన్నిహితులు సందడి చేశారు. వరుణ్, లావణ్య పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 

ప్రధానంగా, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ నవ్వులు చిందిస్తున్న ఓ ఫొటో వైరల్ అవుతోంది. క్యాజువల్ దుస్తుల్లో ఉన్న బాబాయ్, అబ్బాయ్ పెళ్లి వేడుకలో ఉత్సాహంగా తిరుగుతుండడాన్ని ఆ ఫొటోలో చూడొచ్చు. 

ఇక, అల్లు అర్జున్ దంపతులు, నితిన్ దంపతులు, శ్రీజ, నీహారిక... నూతన వధూవరులు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలతో కలిసున్న ఫొటోలు కూడా నెట్టింట సందడి చేస్తున్నాయి.

More Telugu News