Skill Development Case: స్కిల్ కేసులో 12 మంది ఐఏఎస్ లను విచారించండి... సీఐడీకి న్యాయవాది ప్రసాద్ ఫిర్యాదు

Advocate Prasad complains to CID seeking probe on 12 IAS Officers

  • స్కిల్ కేసులో ఆసక్తికర పరిణామం
  • సీమెన్స్ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న అధికారులను విచారించాలన్న న్యాయవాది
  • కాంట్రాక్టు, చెక్ పవర్ తో సంబంధం ఉన్నవారిని కూడా విచారించాలంటూ ఫిర్యాదు

విపక్ష నేత చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 12 మంది ఐఏఎస్ అధికారులను కూడా విచారించాలని న్యాయవాది ప్రసాద్ ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. 

ప్రేమచంద్రారెడ్డి, అజేయ కల్లం, ఉదయలక్ష్మి, కేవీ సత్యనారాయణ, జయలక్ష్మి, సిసోడియా, అజయ్ జైన్, కృతిక శుక్లా, రవిచంద్ర, శామ్యూల్ ఆనంద్ కుమార్, అర్జున్ శ్రీకాంత్, రావత్ లను విచారించాలని కోరారు. 

టీడీపీ హయాంలో సీమెన్స్ ప్రాజెక్టు అమలు, పర్యవేక్షణ కమిటీల్లో పనిచేసిన అధికారులను కూడా స్కిల్ కేసులో విచారణ పరిధిలోకి తీసుకు రావాలని న్యాయవాది ప్రసాద్ స్పష్టం చేశారు. కాంట్రాక్టు, చెక్ పవర్ తో సంబంధం ఉన్న అధికారులను కూడా విచారించాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News