YSR Lifetime Achievement awards: వేడుకగా వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానోత్సవం

YSR lifetime achievement awards ceremony in Vijayawada

  • బుధవారం విజయవాడలో వైభవంగా జరిగిన కార్యక్రమం
  • ముఖ్య అతిథిగా గవర్నర్ జస్టిస్ నజీర్, విశిష్ట అతిథిగా వైఎస్ విజయమ్మ, సీఎం జగన్ హాజరు
  • మొత్తం 27 మంది ప్రముఖులకు అవార్డుల ప్రదానం
  • తన చేతుల మీదుగా అవార్డులు ఇవ్వడంపై గవర్నర్ హర్షం
  • అవార్డు గ్రహీతలు తెలుగు ప్రజల సంపద అని సీఎం జగన్ వ్యాఖ్య

వైఎస్సార్ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డులు-2023 ప్రదానోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విజయవాడలో వైభవంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, విశిష్ట అతిథిగా వైఎస్ విజయమ్మ, సీఎం జగన్ పాల్గొన్నారు. వ్యవసాయం, కళలు- సంస్కృతి, సాహిత్యం, క్రీడలు, వైద్యం, మీడియా, సామాజిక సేవ రంగాలలో విశిష్ట సేవలు అందించిన 27 మంది ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ ఈ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో 23 మందిని జీవితసాఫల్యం పురస్కారం వరించగా నలుగురికి అచీవ్‌మెంట్ అవార్డులు లభించాయి. భారత మాజీ వెయిట్‌లిఫ్టర్ కరణం మల్లీశ్వరి.. జగన్, గవర్నర్ చేతుల మీదుగా లైఫ్‌టైం అచీవ్‌మెంట్ పురస్కారం అందుకున్నారు. 
 ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ తన చేతుల మీదుగా అవార్డులు అందించడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. వైఎస్సార్ తన సంక్షేమ పథకాల ద్వారా తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్నారని అన్నారు.  ఈ అవార్డులు అందుకున్న వారందరూ తమ తమ రంగాల్లో వారి జీవితాన్ని అర్పించారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజల వారసత్వాన్ని తమ భుజాలపై మోస్తున్నారని కితాబిచ్చారు. పురస్కార గ్రహీతలు తెలుగు ప్రజల సంపద అని వ్యాఖ్యానించారు.

YSR Lifetime Achievement awards
YS Jagan
YSRCP
  • Loading...

More Telugu News