rathod bapurao: బీజేపీలో చేరిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు... అదే దారిలో బేతి సుభాష్ రెడ్డి?

Rathod Bapurao joins BJP

  • బీజేపీలోకి కొనసాగుతున్న వలసలు
  • బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానం
  • ఉప్పల్ టిక్కెట్‌పై హామీతో సుభాష్ రెడ్డి కూడా బీజేపీలో చేరే అవకాశం

తెలంగాణలో నేతల పార్టీ మార్పులు కొనసాగుతున్నాయి. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్‌లో టిక్కెట్ దక్కకపోవడంతో రాథోడ్ బాపురావు కమలం పార్టీలో చేరారు.

మరోవైపు, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఉప్పల్ టిక్కెట్ హామీతో ఆయన బీజేపీలోకి వస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈరోజు బీజేపీ మూడో జాబితా రానుంది. ఉప్పల్ టిక్కెట్‌ను బీజేపీ ఎవరికీ కేటాయించలేదు. ఈ రోజు విడుదలయ్యే మూడో జాబితాలో ఉప్పల్ నుంచి భేతి సుభాష్ రెడ్డి పేరు ప్రకటించవచ్చునని తెలుస్తోంది.

rathod bapurao
Telangana Assembly Election
BJP
uppal
  • Loading...

More Telugu News