Indigo Flight: హైదరాబాద్-మాల్దీవ్స్ మధ్య నేరుగా విమానాలు.. అందుబాటులోకి తెచ్చిన ఇండిగో
![Indigo direct flight to Maldives from Hyderabad](https://imgd.ap7am.com/thumbnail/cr-20231101tn6541dd4c9a87e.jpg)
- మంగళ, గురు, శనివారాల్లో మాలెకు డైరెక్ట్ ఫ్లైట్స్
- పునఃప్రారంభించిన ఇండిగో
- ఉదయం 10.20 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరనున్న విమానం
మాల్దీవ్స్‌లో విహరించాలనుకునే ప్రయాణికులకు చౌకధరల విమానయాన సంస్థ ఇండిగో బ్రహ్మాండమైన కబురు చెప్పింది. హైదరాబాద్ నుంచి మాలేకు నిన్నటి నుంచి డైరెక్ట్ సర్వీసులను మళ్లీ ప్రారంభించింది. మంగళ, గురు, శనివారాల్లో హైదరాబాద్-మాలె విమానం అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది.
ఈ మూడు రోజుల్లో శంషాబాద్ విమానాశ్రయంలో ఉదయం 10.20 గంటలకు విమానం బయలుదేరి మధ్యాహ్నం 12.35 గంటలకు మాలె చేరుకుంటుంది. గంట తర్వాత అంటే 1.25 గంటలు తిరిగి అక్కడ బయలుదేరి సాయంత్రం 4.25 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.