Harish Rao: హరీశ్ రావు కాన్వాయ్‌ని తనిఖీ చేసిన పోలీసులు

Police check harish rao canvoy

  • పొన్నాల మెయిన్ రోడ్డులో ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసుల తనిఖీలు
  • పోలీసుల తనిఖీకి సహకరించిన హరీశ్ రావు
  • తనిఖీకి సహకరించినందుకు మంత్రికి పోలీసుల ధన్యవాదాలు

మంత్రి హరీశ్ రావు కాన్వాయ్‌ని పోలీసులు మంగళవారం తనిఖీ చేశారు. సిద్దిపేట జిల్లా పొన్నాల మెయిన్ రోడ్డు వద్ద ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ నిర్వహించారు. ఎన్నికల నిబంధనల నేపథ్యంలో పోలీసులు తన వాహనాన్ని తనిఖీ చేయడంతో హరీశ్ రావు అందుకు సహకరించారు. మంత్రి వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను కూడా పోలీసులు చెక్ చేశారు. తనిఖీకి సహకరించినందుకు మంత్రికి పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.

Harish Rao
Police
Telangana Assembly Election
  • Loading...

More Telugu News