Chandrababu: చంద్రబాబు బెయిల్ పై కొడాలి నాని స్పందన

Kodali Nani on Chandrababu Interim Bail

  • స్కిల్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్
  • ఇది కేవలం నాలుగు వారాల బెయిలే అన్న కొడాలి నాని
  • ఈ మాత్రం దానికే టీడీపీ నేతల సంబరాలు ఎందుకోనని ఎద్దేవా

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. చంద్రబాబుకు కోర్టు ఇచ్చింది కేవలం నాలుగు వారాల పాటు పలు షరతులతో కూడిన బెయిల్ అని కొడాలి నాని చెప్పారు. అది కూడా ఆరోగ్య కారణాలను సాకుగా చూపడం వల్ల ఇచ్చిందని అన్నారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు నిర్దోషి అని కోర్టు చెప్పలేదని తెలిపారు. ఈ మాత్రం దానికే టీడీపీ నాయకుల సంబరాలు ఎందుకోనని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.              

Chandrababu
Telugudesam
Kodali Nani
YSRCP
  • Loading...

More Telugu News