Nakka Anand Babu: చంద్రబాబుకు బెయిల్ వస్తుందనే నిన్న మరో కేసు పెట్టారు: నక్కా ఆనందబాబు

Nakka Anand Babu fires on Jagan

  • చంద్రబాబును జైల్లో పెట్టి జగన్ పైశాచిక ఆనందం పొందారన్న ఆనందబాబు
  • అక్రమ అరెస్ట్ పై ప్రపంచ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయని వ్యాఖ్య
  • మద్యంపై జీవో ఇచ్చిన అజేయ కల్లంపై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్న

తమ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని, ఆయనను అక్రమంగా నిర్బంధించి ముఖ్యమంత్రి జగన్ పైశాచికక ఆనందం పొందారని టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనందబాబు అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో నిరసన కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. జగన్ సీఎం అయిన నాలుగేళ్ల తర్వాత చంద్రబాబును కావాలనే అరెస్ట్ చేయించారని విమర్శించారు. చంద్రబాబుకు ఈరోజు బెయిల్ వస్తుందనే ఉద్దేశంతోనే నిన్న ఆయనపై మద్యం కేసు పెట్టించారని మండిపడ్డారు. మద్యంకు సంబంధించి అప్పుడు జీవో ఇచ్చిన అజేయ కల్లంపై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. చంద్రబాబు, కొల్లు రవీంద్రలపై కేసు పెట్టడం దారుణమని చెప్పారు.

Nakka Anand Babu
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
  • Loading...

More Telugu News