German woman: హమాస్ నగ్నంగా ఊరేగించిన జర్మనీ యువతి దుర్మరణం

German woman paraded naked by hamas found dead

  • అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలపై హమాస్ మెరుపు దాడి
  • స్థానికంగా ఓ మ్యూజిక్ ఫెస్టివల్‌లో పాల్గొంటున్న జర్మనీ యువతిని అపహరించిన హమాస్
  • ఆమెను నగ్నంగా ఊరేగించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్

ఇజ్రాయెల్‌పై దాడి సందర్భంగా హమాస్ ఉగ్రవాద సంస్థ అపహరించిన జర్మనీ యువతి షానీ లూకాస్ దుర్మరణం చెందింది. గాజాలోని ఇజ్రాయెలీ దళాలు ఆమె మృతదేహాన్ని తాజగా గుర్తించాయి. ఈ విషయాన్ని యువతి కుటుంబసభ్యులతో పాటూ ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా తాజాగా ధ్రువీకరించింది. 

అక్టోబర్ 7న గాజా సరిహద్దు ప్రాంతాలపై హమాస్ మెరుపు దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అక్కడ జరుగుతున్న సూపర్ నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌లో ఉన్న షానీని ఉగ్రవాదులు అపహరించారు. కారులో అచేతనంగా పడి ఉన్న షానీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసి దిగ్భ్రాంతికి గురైన ఆమె తల్లి తన బిడ్డను కాపాడాలని ఇజ్రాయెల్, జర్మనీ ప్రభుత్వాలకు బహిరంగంగా మొరపెట్టుకుంది. షానీని హమాస్ ఉగ్రవాదులు ఆ తరువాత కారులో నగ్నంగా ఊరేగించిన దృశ్యాలు కూడా ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి. 

షానీ మృతిపై ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆమె ఎదుర్కొన్న దారుణాలు విని తమ గుండె పగిలిందంటూ ఓ ప్రకటనలో పేర్కొంది.

German woman
Hamas
Israel
  • Loading...

More Telugu News