Virat Kohli: 5న ఈడెన్‌ గార్డెన్‌లో కోహ్లీ బర్త్‌డే వేడుకలు.. ప్లానింగ్ ఏంటంటే..!

Virat Kohli birthday celebrations at Eden Garden on 5th

  • భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో అభిమానులకు 70 వేల విరాట్‌ మాస్క్‌లు
  • ప్రత్యేక బహుమతితోపాటు ప్రత్యేక కార్యక్రమాలు
  • ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న బెంగాల్ క్రికెట్ అసోసియేషన్

ప్రస్తుత వరల్డ్ కప్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పరుగుల యంత్రం, కింగ్ విరాట్ కోహ్లీ నవంబర్ 5న 35వ పుట్టినరోజు వేడుకలు జరుపుకోబోతున్నాడు. తమ అభిమాన క్రికెటర్ బర్త్‌డే కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి ‘క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్’ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈడెన్ గార్డెన్స్‌లో విరాట్ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్‌గా నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది. అదే రోజు కోల్‌కతాలో భారత్‌-దక్షిణాఫ్రికా తలపడనున్న మ్యాచ్‌కు 70 వేల కోహ్లీ మాస్క్‌లను అభిమానులకు పంపిణీ చేయనునట్టు వెల్లడించింది.

వేలాదిమంది అభిమానుల మధ్య అందించేందుకు ప్రత్యేకంగా ఒక బహుమతిని కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మ్యాచ్‌ రోజున కేక్‌ కటింగ్‌తో పాటు ఆకర్షణీయమైన లేజర్‌ షో, బాణసంచా వెలుగులతో సందడి చేయాలని నిర్ణయించినట్టు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. మొత్తంగా స్టేడియానికి వచ్చే కోహ్లీ అభిమానులను అలరించేందుకు ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించింది.


Virat Kohli
Cricket
Team India
  • Loading...

More Telugu News