BJP: తెలంగాణలో బీఆర్ఎస్ ఎంపీకి కూడా భద్రత లేదు.. కేవలం వారికి మాత్రమే భద్రత ఉంది: రఘునందనరావు రీట్వీట్

BJP Rahunandan Rao retweeted BJP tweet

  • తెలంగాణ బీజేపీ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసిన రఘునందనరావు
  • తెలంగాణలో కేసీఆర్ పిల్లలు, మనవళ్లకు మాత్రమే భద్రత ఉందని వ్యాఖ్య
  • బీజేపీ కార్యకర్తపై బీఆర్ఎస్ గూండాలు దాడికి పాల్పడుతున్నారని ఆగ్రహం

తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ ఎంపీకి, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తకు భద్రత లేదని తెలంగాణ బీజేపీ చేసిన ట్వీట్‌ను దుబ్బాక శాసన సభ్యుడు, ఆ పార్టీ నేత రఘునందరావు రీట్వీట్ చేశారు. ఈ తెలంగాణలో కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్, వారి పిల్లలు, మనవళ్లకు మాత్రమే భద్రత ఉందని వ్యాఖ్యానించారు. కానీ అధికార పార్టీ ఎంపీకి కూడా భద్రత లేదన్నారు. బీజేపీ కార్యకర్తలపై అధికార బీఆర్ఎస్ గూండాలు దాడికి పాల్పడుతున్నారని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమ కార్యకర్త నవీన్‌పై బీఆర్ఎస్ రౌడీలు చేసిన హత్యాయత్నాన్ని ఖండిస్తున్నామన్నారు. అధికార పార్టీ రౌడీయిజానికి డిసెంబర్ 3వ తేదీతో తెరపడనుందన్నారు.

రఘునందరావు అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ... కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఖండించారు. తాను గెలుస్తున్నాననే అధికార బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందన్నారు. బట్టకాల్చి మీద వేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎంపీపై బీజేపీ కార్యకర్త కనుక దాడికి పాల్పడితే అతడిని తానే తీసుకు వచ్చి పోలీసులకు అప్పగిస్తానని సవాల్ చేశారు.

BJP
Raghunandan Rao
kotha prabhakar reddy
Telangana Assembly Election

More Telugu News