Stock Market: వారాన్ని లాభాలతో ప్రారంభించిన స్టాక్ మార్కెట్లు
- 330 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 94 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 2.44 శాతం లాభపడ్డ అల్ట్రాటెక్ సిమెంట్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం నాటి లాభాలను ఈ రోజు కూడా కొనసాగించాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత వెంటనే మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. కార్పొరేట్ ఫలితాలు సానుకూలంగా వస్తుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 330 పాయింట్లు లాభపడి 64,113కి చేరుకుంది. నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 19,141కి ఎగబాకింది.
అల్ట్రాటెక్ సిమెంట్ (2.44%), రిలయన్స్ (2.04%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.30%), భారతి ఎయిర్ టెల్ (1.24%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.04%).
టాటా మోటార్స్ (-1.94%), మారుతి (-1.52%), యాక్సిస్ బ్యాంక్ (-1.31%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.82%), ఐటీసీ (-0.72%).