TSRTC: ఈ ప్రమాదానికి కారణం ఏంటంటూ సజ్జనార్ ట్వీట్.. వీడియో ఇదిగో!

TSRTC MD VC Sajjanar Video Tweet On Road Saftey

  • వీడియో పోస్ట్ చేసిన టీఎస్ ఆర్టీసీ బాస్
  • ఎదురెదురుగా ఢీ కొన్న రెండు బైకులు
  • అతివేగం, నిర్లక్ష్యమేనంటూ నెటిజన్ల కామెంట్లు

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తాజాగా ట్వీట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రోడ్ సేఫ్టీపై వాహనదారుల్లో అవగాహన కోసం సజ్జనార్ తరచుగా ఫొటోలు, వీడియోలను తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో పోస్ట్ చేస్తుంటారు. అందులో భాగంగానే తాజాగా ఓ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఆయన షేర్ చేశారు. ఈ వీడియోలో ఎదురెదురుగా వచ్చిన రెండు బైక్ లు ఢీ కొనడం, వాహనదారులు ఇద్దరూ కిందపడడం కనిపిస్తోంది. ఈ వీడియోను ట్వీట్ చేస్తూ దీనికి కారణమేంటని సజ్జనార్ నెటిజన్లను ప్రశ్నించారు.

ముందు వెళుతున్న ఆటోను ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో స్కూటీ నడుపుతున్న వ్యక్తి రోడ్డుకు కుడివైపుకు రాగా ఎదురుగా వేగంగా వచ్చిన బైకర్ ఢీ కొట్టాడు. రెండు వాహనాల వేగం చాలా ఎక్కువగా ఉండడంతో ప్రమాదాన్ని తప్పించేందుకు వాహనదారులు చేసిన ప్రయత్నం విఫలమైంది. బైకర్ వేగంగా వచ్చి స్కూటీని ఢీ కొట్టాడు. దీంతో బైక్, స్కూటీ రెండూ తుక్కుతుక్కు కాగా వాహనదారులు కిందపడడం వీడియోలో కనిపిస్తోంది. ఈ ప్రమాదానికి కారణమేంటని సజ్జనార్ ప్రశ్నించగా.. అతివేగం, నిర్లక్ష్యమే కారణమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More Telugu News