Anchor Vishnu Priya: విష్ణుప్రియ అనారోగ్యంతో బాధపడుతోందా?.. వైరల్ గా మారిన రీల్

Anchor Vishnu Priya About Her Career And Mental Health Problems

  • కొన్ని రోజులుగా బుల్లి తెరపై కనిపించని యాంకర్
  • ఆధ్యాత్మిక యాత్రలలో కాలం గడుపుతున్న వైనం
  • అన్నీ ఖరాబ్.. అయినా చిల్ అవుతున్నానంటూ విష్ణుప్రియ పోస్ట్

బుల్లితెరపై ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న యాంకర్లలో విష్ణుప్రియ ఒకరు.. పలు ఈవెంట్లలోనూ తళుక్కున మెరిసిన ఈ యాంకర్ కొన్ని రోజులుగా ఎక్కడా కనిపించడంలేదు. టీవీ షోలు, ఈవెంట్లు, వెబ్ సిరీస్ లు.. వేటిలోనూ ఆమె నటించడంలేదు. దీంతో విష్ణుప్రియకు ఏమైందని ఆమె అభిమానులు, ఫాలోవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే యాంకర్ తాజాగా ఓ రీల్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన ప్రస్తుత పరిస్థితిపై క్లారిటీ ఇచ్చింది.

ఆరోగ్యం పాడైంది, కెరీర్ దెబ్బతింది, షెడ్యూల్స్, రిలేషన్స్.. ఇలా అన్నీ ఖరాబ్ అయినా సరే ఇలా చిల్ అవుతున్నా అంటూ వైరల్ అవుతున్న రీల్ ను పోస్ట్ చేస్తూ ప్రస్తుతం తన పరిస్థితి కూడా ఇలాగే ఉందని విష్ణుప్రియ చెప్పింది. బుల్లితెరపై విష్ణుప్రియకు గతంలో చాలా క్రేజ్ ఉండేది. షో ఏదైనా సరే ఆమె ఉండాల్సిందే అన్నట్లుగా విష్ణుప్రియ హవా నడిచింది. దాదాపుగా అన్ని టీవీ చానెళ్లలోనూ ఆమె కనిపించేది. యూట్యూబ్ లోనూ ఓ చానెల్ రన్ చేస్తోంది. మానస్‌తో కలిసి చేసిన ప్రైవేట్ ఫోక్ ఆల్బమ్స్ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోన్నాయి.

More Telugu News