Rachin Ravindra: టెండూల్కర్‌ రికార్డును బద్దలుగొట్టి.. కోహ్లీని వెనక్కి నెట్టేసిన రచిన్ రవీంద్ర

Rachin Ravindra Breaks Sachin Tendulkar Record In World Cup

  • ప్రపంచకప్‌లో 23వ ఏట రెండు సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా రచిన్ రవీంద్ర
  • ప్రస్తుత ప్రపంచకప్‌లో 400 పరుగులు దాటిన మూడో ఆటగాడు కూడా
  • ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాాధించి కోహ్లీ, మార్కరమ్‌లను వెనక్కినెట్టేసిన వైనం

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించిన న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్, అబ్దుల్లా షఫీక్, నికోలస్ పూరన్, పాల్ స్టిర్లింగ్ రికార్డులను బద్దలుగొట్టాడు. టెండూల్కర్ సహా వీరు ముగ్గురు ప్రపంచకప్‌లలో తమ 23వ ఏట సెంచరీ సాధించిన రికార్డు సొంతం చేసుకున్నారు.

ధర్మశాలలో గత రాత్రి ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో విలియన్స్ గైర్హాజరీలో మూడో స్థానంలో క్రీజులోకి వచ్చిన రవీంద్ర 89 బంతుల్లో 116 పరుగులు సాధించాడు. ఇందులో 9 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఈ శతకంతో రచిన్ అత్యంత అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 23 ఏళ్ల వయసులో ప్రపంచకప్‌లో ఛేజింగ్‌లో రెండు సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.  

ఇంగ్లండ్‌తో జరిగిన ప్రపంచకప్ అరంగేట్ర మ్యాచ్‌లోనే రచిన్ సెంచరీ సాధించాడు. 96 బంతుల్లోనే 126 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. ఈ టోర్నీలో రచిన్ ఇప్పటి వరకు ఆరు మ్యాచుల్లో 406 పరుగులు సాధించాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో 400 పరుగుల మార్క్ దాటిన మూడో ఆటగాడు రవీంద్రే. అంతేకాదు, ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన విరాట్ కోహ్లీ, మార్కరమ్‌లను వెనక్కి నెట్టేశాడు. ప్రపంచకప్‌లో 24 ఏళ్లలోపు అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రచిన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. సచిన్ 806 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, పాంటింగ్, బాబర్ ఆజం వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

More Telugu News