Devineni Uma: చంద్రబాబుకు రక్షణగా ఆర్థికమంత్రి బంధువా... చంద్రబాబును ఏం చేయాలనుకుంటున్నారు?: దేవినేని ఉమా

Devineni Uma fires on YCP govt

  • రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు
  • జైలు ఇన్చార్జిగా డీఐజీ రవికిరణ్
  • రవికిరణ్ ఆర్థికమంత్రి బుగ్గనకు సమీప బంధువు!
  • చంద్రబాబుకు ఏమైనా జరిగితే వైసీపీ నేతలను ప్రజలు తరిమి కొడతారన్న ఉమా

రాజమండ్రి జైలులో చంద్రబాబుకు రక్షణగా ఆర్థికమంత్రి బంధువు (డీఐజీ రవికిరణ్)ను  పెట్టడంలో ఆంతర్యం ఏమిటని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా సీఎం జగన్ ను నిలదీశారు. జైల్లో చంద్రబాబును ఏం చేద్దామనుకుంటున్నారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చంద్రబాబు ఉన్న జైలుపై డ్రోన్ ఎగిరింది, పెన్ కెమెరా దొరికింది... కానీ ఒక్క అధికారిని కూడా ఎందుకు సస్పెండ్ చేయలేదు? అంటూ ఉమా ప్రశ్నించారు. పైగా, సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత జైల్లోకి డీజీపీ వెళ్లాలన్నా ఆంక్షలు ఉంటాయి... అలాంటిది జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ జైలు పరిసరాల్లో ప్రెస్ మీట్ ఎలా ఏర్పాటు చేస్తారంటూ మండిపడ్డారు. 

"చంద్రబాబుకు నడుం నొప్పి సమస్య ఉంది... ఆయనకు కంటి ఆపరేషన్ తప్పనిసరి అని డాక్టర్లు కూడా చెబుతున్నారు... జైల్లో తన ఆరోగ్యానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, భద్రత లేదని చంద్రబాబు లేఖ రాశారు. చంద్రబాబుకు ఏదైనా జరిగితే వైసీపీ నాయకులను ప్రజలు తరిమి కొడతారు. చంద్రబాబుకు ఏం జరిగినా సీఎం జగన్, హోంమంత్రి తానేటి వనిత, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిలదే బాధ్యత" అని ఉమా హెచ్చరించారు.

More Telugu News