Renu Desai: క్యారెక్టర్ ను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదు: రేణు దేశాయ్‌

Renu Desai anger on comments on heroines

  • హీరోయిన్లపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారన్న రేణు దేశాయ్
  • లుక్, యాక్టింగ్ పై కామెంట్లు చేస్తే పర్వాలేదని వ్యాఖ్య
  • ప్రతిసారీ తనను, తన పిల్లలను లాగడం ఏమిటని ప్రశ్న   

ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ మళ్లీ సినిమాలపై ఫోకస్ పెంచుతున్నారు. రవితేజ చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రంలో నటించిన రేణు... వరుస ఇంటర్వ్యులు ఇస్తూ, సంచలన విషయాలను బయటపెడుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... హీరోయిన్లపై వచ్చే కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అమ్మాయి లుక్ పై కామెంట్ చేయొచ్చని, యాక్టింగ్ పై కామెంట్లు చేయొచ్చని... కానీ ఆమె క్యారెక్టర్ ను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఎంత మందితో పడుకుంది? అని మాట్లాడుతూ ఆడవాళ్ల వ్యక్తిత్వాన్ని చంపేస్తున్నారని చెప్పారు. ఇలాంటివి మానుకోవాలని సూచించారు. 

పవన్ కల్యాణ్ పై రాజకీయ విమర్శలు చేసినా, ఆయన మేనిఫెస్టోను విమర్శించినా తనకు ఇబ్బందిలేదని... కానీ ప్రతిసారీ తనను, తన పిల్లలను లాగడం ఏమిటని మండిపడ్డారు. తమను టార్గెట్ చేయడం మరీ ఎక్కువవుతోందని... వీటికి ముగింపు పలకాలని అన్నారు.

Renu Desai
Tollywood
Pawan Kalyan
Janasena
  • Loading...

More Telugu News