Talasani: ఓట్ల కోసం గద్దల్లా వాలిపోయే వారి పట్ల జాగ్రత్త: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Talasani Srinivas Yadav door to door campaign

  • బోలక్‌పూర్ ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన తలసాని
  • మరోసారి బీఆర్ఎస్‌దే అధికారమని మంత్రి ధీమా
  • కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి

ఎన్నికల సమయంలో మాత్రమే ఓట్ల కోసం గద్దల్లా వాలిపోయేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం బన్సీలాల్‌పేట డివిజన్‌లోని బోలక్‌పూర్ ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో మాత్రమే కొంతమంది వస్తుంటారని, కానీ ఎన్నికల తర్వాత అడ్రస్ ఉండదన్నారు. తెలంగాణలో మరోసారి అధికారం బీఆర్ఎస్‌దేనని, కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారన్నారు.

కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని ఆయన ప్రజలను కోరారు. మళ్లీ గెలిస్తే వంట గ్యాస్ ధరను రూ.400కే అందిస్తామన్నారు. రేషన్ ద్వారా సన్న బియ్యం అందిస్తామన్నారు. సనత్ నగర్ ప్రాంతంలో ప్రజల అవసరాల దృష్ట్యా ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. ఎవరికి అవసరమున్నా తాను ఉన్నాననే విషయం మరిచిపోవద్దన్నారు. ఇక్కడ గెలుపొందినవారు గతంలో ఎన్నికల సమయంలోనే వచ్చేవారని, మిగతా సమయాల్లో అందుబాటులో ఉండేవారు కాదన్నారు. తాను నిత్యం ప్రజల్లోనే ఉంటున్నట్లు చెప్పారు.

Talasani
BRS
Telangana Assembly Election
  • Loading...

More Telugu News