Ayyanna Patrudu: మంత్రి అంబటి 'కులం' వ్యాఖ్యలపై అయ్యన్న సెటైర్

Ayyanna counters minister Ambati tweet

  • ఖమ్మంలో మంత్రి అంబటికి వ్యతిరేకంగా టీడీపీ మద్దతుదారుల నినాదాలు
  • నాకూ ఓ కులం ఉంది అంటూ అంబటి ట్వీట్
  • అందరికీ తెలిసిందేగా 'రసికులం' అంటూ అయ్యన్న కౌంటర్

స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యాక రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. వైసీపీ నేతలకు నిరసన సెగలు తగులుతున్నాయి. ఖమ్మంలో మంత్రి అంబటి రాంబాబుకు టీడీపీ శ్రేణుల చేతిలో చేదు అనుభవం ఎదురైంది. సోషల్ మీడియాలో ఆయన స్పందిస్తూ, "కులోన్మాదంతో దాడి చేయాలనుకుంటే నాకూ ఒక కులం ఉంది... గుర్తుపెట్టుకోండి" అంటూ హెచ్చరిక చేశారు. అయితే, అంబటి ట్వీట్ కు టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు. అందరికీ తెలిసిందేగా 'రసికులం' అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. సోషల్ మీడియాలో ఈ మాటల యుద్దానికి నెటిజన్ల నుంచి విశేషంగా స్పందన వస్తోంది.

Ayyanna Patrudu
Ambati Rambabu
Caste
TDP
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News